![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -15 లో.. రింగ్ దొరికింది అమ్మ అని సీతాకాంత్ తన తల్లికి హ్యాపీగా చెప్తాడు. క్యాబ్ లో పడిపోయింది ఆ అమ్మయి కీ ఫోన్ చేస్తున్నా కట్ చేస్తున్నారు. నేను ఆఫీస్ కీ వెళ్తున్నా మీటింగ్ ఉంది అంటు సీతాకాంత్ వెళ్తాడు. ఆ తర్వాత శ్రీవల్లి పరుగున వచ్చి గోల్డ్ షాప్ కి వెళదామా మీ సవతి కొడుకుకి ఇంకొక రింగ్ కొనడానికి అని తన అత్త శ్రీలతతో అంటుంది.
ఆ తర్వాత సీతాకాంత్ వాళ్ళ అమ్మ శ్రీలత పీఏకీ ఫోన్ చేసి క్యాబ్ అమ్మాయి డీటెయిల్స్ లొకేషన్ ని షేర్ చెయ్యమని చెప్తుంది. అంటే ఇప్పుడు మీరు ఆ డ్రైవర్ వాళ్ళ ఇంటికి వెళ్తారా అని శ్రీవల్లి అడుగుతుంది. వెళ్తాను ఆల్రెడీ వాళ్ళు ఆ రింగ్ పట్టుకొని పారిపోయి ఉంటారని అతను అనగా.. కానీ నేను అంత తేలికగా వదిలి పెట్టనని శ్రీలత అంటుంది. ఆ తర్వాత శ్రీలత తన సెక్యూరిటీ వాళ్లని తీసుకొని రామలక్ష్మి ఇంటికి వస్తుంది. వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉండడంతో సెక్యూరిటీ తాళం పగులగొట్టి ఇల్లంతా చిందర వందర చేస్తారు. అప్పుడే రామలక్ష్మి అమ్మ మరియు పింకీ ఇద్దరు గుడికి వెళ్లి వస్తుంటే.. ఒక అబ్బాయి కలిసి మీ ఇంటి తాళం ఎవరో పగులగొట్టారని చెప్పగానే.. ఇద్దరు ఇంటికి పరుగున వెళ్తారు. ఎవరు మీరు? ఏం చేస్తున్నారని అడుగుతారు. రింగ్ ఎక్కడ పెట్టారో చెప్పమని ఓ సెక్యూరిటీ అతను రామలక్ష్మి వాళ్ళ అమ్మని అడుగుతాడు.. మాకేం తెలియదని వాళ్ళు చెప్తారు.
మరొకవైపు సీతాకాంత్ ని కలవడానికి రామలక్ష్మి తన ఆఫీస్ కి వెళ్తుంది. సీతాకాంత్ దగ్గరికి వెళ్లిన రామలక్ష్మి రింగ్ ఇస్తుంది. ఆ రింగ్ చూసి అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ.. ఇది మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ అంటూ చెప్తాడు. రింగ్ తోసుకొని వచ్చినందుకు కృతజ్ఞతగా.. కొంత డబ్బును సీతాకాంత్ ఇస్తాడు. నా నిజాయితి కీ వెలడుతున్నారా అంటు రామలక్ష్మి చెప్పి తీసుకోదు. మరొక వైపు మాణిక్యంం తన ఇంటికి ఎవరో వచ్చి గొడవ చేస్తున్నారని తెలిసి కోపంగా వెళ్తాడు. సీతాకాంత్ తన అమ్మ శ్రీలతకి ఫోన్ చేసి.. రింగ్ దొరికింది అని చెప్తాడు. దాంతో శ్రీలత తన సెక్యూరిటీ వాళ్ళని తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత మాణిక్యం ఇంటికి వస్తాడు. కాసేపటి తర్వాత రామలక్ష్మి ఇంటికి వస్తుంది. చిందర వందరగా ఉన్న వస్తువులని చూసి.. ఏమైంది అని అడుగుతుంది. రింగ్ పోగొట్టుక్కున్న వాళ్ళ అమ్మ అంట.. రింగ్ ఎక్కడ అంటు తన మనుషులని తీసుకొని వచ్చి ఇలా చేసిందని పింకి చెప్పగానే.. రామలక్ష్మి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |